గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (17:03 IST)

మెగాస్టార్ చిరంజీవి, ఊర్వశి రౌతేలా వాల్తేర్ వీరయ్య నుండి బాస్ పార్టీ విడుదల

Chiranjeevi, Urvashi Rautela
Chiranjeevi, Urvashi Rautela
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేర్ వీరయ్య' 2023లో విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. ఈ సినిమా విశేషమేమిటంటే, చిరంజీవి మాసియస్ట్ క్యారెక్టర్‌లో అభిమానులు, మాస్ కు  పూనకాలు తెప్పించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానైన దర్శకుడు బాబీ కొల్లి.. మెగాస్టార్ ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌ లో ప్రజంట్ చేస్తున్నారు.
 
ఈ రోజు విడుదలైన 'వాల్తేర్ వీరయ్య' ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ వెండితెరపై సృష్టించబోయే మాస్ ప్రభంజనంకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా వేదికగా వైరల్‌ గా మారింది. టీమ్ ప్రమోట్ చేసిన ప్రకారం..  బాస్ పార్టీ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది.
 
 మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుతూ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేసి, ఆయనే రాసి, పాడారు. బాస్ పార్టీ  డీఎస్పీ స్టయిల్ లో మాస్ మసాలా నంబర్. నకాష్ అజీజ్,  హరిప్రియ డైనమిక్ గా పాడిన ఈ పాటకు దేవిశ్రీ ర్యాప్ డబల్ ఎనర్జీ జోడిస్తుంది. డీఎస్పీ ట్రాక్‌ లైవ్లీ గా ఎంటర్ టైనింగా ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా మెస్మరైజ్ చేస్తోంది.  
 
మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన డాన్సులతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. లుంగీలో చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్,  మాస్ అప్పీలింగ్ డ్యాన్సులు అవుట్ స్టాండింగా వున్నాయి. ముఖ్యంగా మెగా హుక్ స్టెప్ మార్వలెస్. ఊర్వశి రౌతేలా చిరంజీవి ఎనర్జీని అందుకోవడానికి ప్రయత్నించి విజయం సాధించింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
 
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. 
 
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.
 
ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.