ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (08:23 IST)

చిరంజీవి జ్ఞాపకాలు పదిలంగా వున్నాయట

chiranjeevi, navy officers
chiranjeevi, navy officers
మెగాస్టార్‌ చిరంజీవి తన జీవితంలో ఏది కొత్తగా ప్రయత్నించినా వాటిని జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకుంటారు. అందుకు దాని గురించి సమాచారం కూడా మస్తిష్కంలో పదిలంగా వుండిపోతుంది. గత నెలలో గోవాకు వెళ్ళినప్పుడు అక్కడ నావీ అధికారులు చిరంజీవితో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు. దీనికి తనెంతో మురిసిపోయాయనీ, దేశాన్ని కాపాడేవారు తనతో ఇలా దగ్గరగా రావడం చూసి గత జ్ఞాపకాలు మెదిలాయని ట్వీట్‌ చేశారు.
 
విమానాశ్రాయానికి రాగానే కొందరు నావికా అధికారులు తనను కలవడం చాలా గర్వంగా వుంది. ఒక్కసారిగా నేను స్కూల్‌డేస్‌లో వున్నప్పుడు ఎన్‌సిసి.లో పాల్గొన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పటినుంచో తనలో దేశభక్తి కలిగిందనీ, అందుకు తన టీచర్లు తీర్చిదిద్దిన విధానం మిమ్మల్ని చూస్తుంటే కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఎన్‌సిసి ఫొటోను కూడా చిరంజీవి పోస్ట్‌ చేశారు.