శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (19:16 IST)

ఫ్రాన్స్‌ లో షూట్ చేసిన వాల్తేరు వీరయ్య సాంగ్‌ను లీక్‌ చేసిన చిరంజీవి! (video)

Chiranjeevi, Shruti Hasan
Chiranjeevi, Shruti Hasan
ఇటీవలే వాల్తేరు వీరయ్య చిత్రంలోని ఓ పాట కోసం చిరంజీవి, శ్రుతిహాసన్‌ ఫ్రాన్స్‌కు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఫొటో కూడా షేర్‌ చేశారు. తాజాగా పాట పూర్తయింది. తిరిగి వస్తున్న నేపథ్యంలో అక్కడి అందాలను చూపిస్తూ, ఆ పాటను లీక్‌ చేస్తున్నా అంటూ ఎవరికీ చెప్పకండి.. అంటూ సరదాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. 
 
Chiranjeevi in France
Chiranjeevi in France
హాయ్‌ ఫ్రెండ్‌. నేను చిరంజీవిని. ఫ్రాన్స్‌ నుంచి మాట్లాడుతున్నా. ఈనెల 12న శ్రుతిహాసన్‌తో సాంగ్‌ పూర్తయింది. చాలా ఎగ్జైట్‌గా వుంది. లొకేషన్స్‌ చాలా బ్యూటిఫుల్‌గా వున్నాయి. ఇది సౌత్‌ ఫ్రాన్స్‌లోనిది. స్విట్జర్లాండ్‌, ఇటలీ బోర్డర్‌లో లోయలో వుంది. సౌతాఫ్‌ ఫ్రాన్స్‌ లేజె అంటారు.  నాకైతే చాలా ఎగ్జైట్‌గా వుంది. మైనస్‌ 8 డిగ్రీల చలిలో డాన్స్‌ చేయాల్సివచ్చింది. నాకైతే చాలా కష్టంగా అనిపించింది. మీ కోసం ఇష్టంగా చేశాను. ఆ అందాలను ఆపుకోలేక మీకోసం విజువల్స్‌ పంపుతున్నానంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశారు.
త్వరలో లిరికల్‌ వీడియో రాబోతుంది. ఎంజాయ్‌ చేయండి. .అంటూ సాంగ్‌ బిట్‌ను లీక్‌ చేస్తున్నా. ఎవరికీ చెప్పకండి అంటూ..పాటను వినిపించారు.
`నువ్వే శ్రీదేవైతే.. అయితే.. 
నేనే చిరంజీవిని అవుతా.. అంటూ దేవీశ్రీ ప్రసాద్‌ పాడిన పాట అది. సంగీతం కూడా తనే సమకూర్చాడు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుంది.