సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:49 IST)

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ కు ఆహ్వానితులుగా రాంచరణ్

Ramcharn receving invitaion
Ramcharn receving invitaion
హీరో రాంచరణ్ కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. అయన నటించిన ఆర్.ఆర్.ఆర్. సినిమాకు పై అంతర్జాతీయ అవార్డ్స్ తో పాటు, ఎన్ టి. ఆర్. తో కలిసి చరణ్ డాన్స్ చేసిన నా టు నా టు సాంగ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. మరో వైపు రాంచరణ్, ఉపాసన తల్లి తండ్రి కాబోతున్నారు. ఇక మూడో ముచ్చటగా మోడీ హాజరయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమంకు ఆయనకు ఆహ్వానం అందింది. 
 
కొద్దీరోజుల్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో జరిగే పి ఎస్ ఏం 100 (ఆధ్యాత్మిక కార్యక్రమం) కోసం  మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ను స్వామీజీలు స్వయంగా హైదరాబాద్ వచ్చి  ఆహ్వానిం చారు. ఈ ఫోటోను చరణ్ పోస్ట్ చేసాడు. 
 
భారత ప్రధాని నరేద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి గురువు అయినా స్వామి మహారాజ్ ను ప్రముఖులు కూడా గురువుగా భావిస్తారు. ముఖేష్ అంబానీ, ఇతర ప్రముఖులు కూడా స్వామి మహారాజ్ విగ్రహం ఆవిష్కరణను  రామ్‌చరణ్‌తో పాటు ఆహ్వానించబడ్డారు.