ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (15:51 IST)

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ డాన్స్ చేసిన నాల్గవ పాట పూనకాలు లోడింగ్

Chiranjeevi and Ravi Teja dance
Chiranjeevi and Ravi Teja dance
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాత్రలను పరిచయం చేస్తూ 'వాల్తేరు వీరయ్య' మేకర్స్ రెండు విభిన్న ప్రోమోలను విడుదల చేశారు. టీమ్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటల్లోనూ మెగాస్టార్ చిరంజీవి అలరించారు. ఇప్పుడు మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజాలని కలిసి చూసే సమయం వచ్చింది. చిరంజీవి, రవితేజ కలిసి నటించిన పూనకాలు లోడింగ్ పాట డిసెంబర్ 30న విడుదల కానుంది. రెండు రోజుల ముందుగానే వారు న్యూ ఇయర్ గిఫ్ట్ ని అందిస్తున్నారు.
 
అనౌన్స్ మెంట్ పోస్టరే పూనకాలు తెప్పించేస్తోంది. అందులో చిరంజీవి, రవితేజ ఒకరినొకరు ఫెరోషియస్ గా చూస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లో జాతర వాతావరణం కనిపిస్తోంది. పోస్టర్ లో చిరంజీవి, రవితేజ కాంట్రాస్ట్ లుక్‌ లో కనిపిస్తున్నారు. చిరు టైటిల్ రోల్‌ లో కనిపిస్తుండగా, రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. మెగా మాస్ పూనకాలు చూడాలంటే ఇంకో రోజు ఆగాలి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ ని స్కోర్ చేసాడు. నాలుగో పాట ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి మెగా మాస్ సాంగ్‌ ఆఫ్ ది ఇయర్ కాబోతోంది.
 
బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.
 
ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
 
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.