గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (16:49 IST)

వాల్తేరు వీరయ్యలోని పూనకాలు కోసం థియేటర్ల డెకరేషన్‌

chiranjeevi ccuout at sandhya
chiranjeevi ccuout at sandhya
మెగాస్టార్‌ చిరంజీవి, శతి హాసన్‌, రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలోని పూనకాలు పాటకు ఇప్పటికే అలంకరణ మొదలైంది. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంథ్య థియేటర్‌ ఇందుకు వేదికైంది. ఈరోజు సాయంత్రం 5గంటల తర్వాత చిత్ర నిర్మాతలు, సాంకేతిక సిబ్బందితో అభిమానుల సమక్షంలో పూనకాలు పాట లోడిరగ్‌ విడుదల చేయనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఆర్ధర్‌ కె విల్సన్‌ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
 
theater decaration
theater decaration
రవితేజ, చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాట నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని గీత రచయిత చంద్రబోస్‌ తెలియజేశారు. ఈ సినిమాలో బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్‌, క్యాథరీన్‌ త్రెసా వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రవిశంకర్‌, నవీన్‌ ఎర్నేని, చెర్రి నిర్మించారు. బాబి కొల్లి దర్శకత్వం వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని  ఎంపిక చేసిన థియేటర్స్‌ లో ఈ పాట లాంచ్‌ చేయనున్నారు. అయితే దాని కోసం ఆయా థియేటర్స్‌ ని ఇప్పటికే మెగా, మాస్‌ రాజా ఫ్యాన్స్‌ గ్రాండ్‌ గా ముస్తాబు చేసి రెడీ చేసారు.