మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (15:36 IST)

క్రమశిక్షణ లోపించిన జై బాలయ్య అభిమానులు!

balayya cautout
balayya cautout
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఫ్యాన్స్‌ పక్కామాస్‌ సంగతి సరేసరి. మొదటిరోజు మొదటి ఆట చూడాలనే ఆరాటం ఎక్కువ. గురువారంనాడు తెల్లవారుజామున 5గంటలకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో బాలయ్య వీర సింహ రెడ్డి సినిమా చూశాడు. ఆయన ఉన్నాడనో మరోదో కానీ హాలంతతా దద్దరిల్లిపోయిన హడావుడి. సాంగ్‌ వస్తేచాలు కాగితాలు చించేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఐమాక్స్‌ థియేటర్‌కు వచ్చేసరికి ప్రేక్షకులు కాస్త తగ్గారు.
 
ఇదిలా వుండగా, ఓవర్‌సీస్‌లోనూ జైబాలయ్య పూనకాలు వచ్చేశాయి. ఇండియాలో ఈ పూనకాలు భరించడం మామూలే. కానీ అమెరికాలో అది సాధ్యపడలేదు. ఓ థియేటర్‌లో జై బాలయ్య అంటూ గోలగోల చేయడం, కాగితాలు చించి ఎగరేయడంతో అక్కడి మేనేజ్‌మెంట్‌ అందరినీ బయటకు పంపింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులకు ఫుల్‌ క్లాస్‌ పీకారు. ఇది సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. అమెరికా వెళ్ళినా ఇంకా అనాకపల్లి బుద్ధులు పోలేదని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేయడం విశేషం.