శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (13:31 IST)

నేడు నారావారి పల్లెకు చంద్రబాబు - బాలకృష్ణ కుటుంబ సభ్యులు

chandrababu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రతియేటా సంక్రాంతి సంబరాలను స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకల్లో ఆయన వియ్యంకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొంటారు. ఇందుకోసం ఇందుకోసం చంద్రబాబు, బాలయ్యలు తమతమ కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు స్వగ్రామమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారావారి పల్లెకు వస్తుంటారు. ఈ యేడాది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు కుటుంబ సమేతంగా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వారు నారావారి పల్లెకు రాత్రి 8 గంటలకు చేరుకుంటారు. 
 
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, బావమరిది నందమూరి రామకృష్ణ దంపతులు, వది లోకేశ్వరి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రానికి నారావారి పల్లెకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు చంద్రబాబు విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇంటికి వెళతారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండే చంద్రబాబు ఈ నెల 15వ తేదీ సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు.