బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

టీడీపీ సరికొత్త ప్రచారం.. "సైకో పోవాలి.. సైకిల్ రావాలి"

psycho jagan
అధికార వైకాపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని టీడీపీ ఐటీ వింగ్ ఈ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది ఫలితంగా బుధవారం "సైకో జగన్" పేరుతో ఓ హ్యాష్‌టాగ్ రోజంతా ట్రెండింగ్‌లో ఉన్నది. అంతేకాకుండా "సైకో పోవాలి.. సైకిల్ రావాలి" అంటూ ఓ పాటను కూడా డిజైన్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైకాపా ప్రభుత్వ బాధితులతో దీన్ని రూపొందించారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ సాగే ఈ పాటకు సంగీతం కూడా ఎంతో అద్భుతంగా సమకూర్చారు. 
 
ట్విట్టర్ వేదికగా సైకో జగన్ పేరుతో టీడీపీ సాగించిన ప్రచార సమరం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. 18 వేల మందికిపైగా నెటిజన్లు స్పందించడంతో ఇది జాతీయ స్థాయిలో ప్రముఖ అంశంగా మారింది. పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలు, విధ్వంసాలు, సామాన్యులపై దౌర్జన్యాలు వంటి అంశాలపై ఆ పార్టీకి చెందిన ఐ టీడీపీ విభాగం ప్రచార సమరానికి శ్రీకారం చుట్టింది. సైకో జగన్ అనే హ్యాష్‌టాగ్ పెట్టారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. అనే నినాదంతో ట్విట్టర్‌ వేదికపై హోరెత్తించారు. దీనికి నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించడంతో ఇది జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది.