బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (22:04 IST)

ప్రజల్లో నెలకొన్న ప్రశ్నలను పవన్‌ కళ్యాణ్‌ను అడిగేసిన బాలకృష్ణ

Balakrishna,   Pawan Kalyan
Balakrishna, Pawan Kalyan
పవన్‌ కళ్యాణ్‌తో నందమూరి బాలకృష్ణ ఆహాలో చిట్‌చాట్‌ చేస్తున్నాడు అనగానే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చేసింది. బాలకృష్ణ ఏదైనా అడుగుతాడు. పవన్‌ సమాధానం ఎలా చెబుతారని ఆసక్తి వుంది. అందుకు తగినట్లుగా తాజా ప్రోమోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఇందులో చిరంజీవి గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు వున్నాయి. మెగాస్టార్‌లో పవన్‌కు నచ్చని విషయం ఏమిటని బాలకృష్ణ అడిగారు. అలాగే మీరు చిరంజీవి నుంచి ఏమి నేర్చుకున్నారు? 
 
అలాగే అభిమానుల అభిమానాన్ని ఎన్నికల్లో ఎందుకు ఓట్లుగా మార్చుకోలేకపోయారని కూడా ప్రశ్నించారు. ఇవే ప్రధానంగా ప్రజల్లో నెలకొన్న ప్రశ్నలు. వీటికి త్వరలో పవన్‌ కళ్యాణ్‌ ఏవిధంగా సమాధానం చెబుతారనేది ఇంట్రెస్ట్‌ కలిగించింది. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమారంగం గురించి పలు ప్రశ్నలు వేశారు. ఈ ఎపిసోడ్‌ త్వరలో టెలికాస్ట్‌ కానుంది. అది ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఆహా విడుదల చేసింది. ఇద్దరూ చాలా సరదాగా జోవియల్‌గా వున్నట్లు చూపించింది.