శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (11:19 IST)

గాండివదారి అర్జున టైటిల్‌తో వరుణ్‌ తేజ్‌

varuntej title
varuntej title
హీరో వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ టైటిల్‌ను ప్రకటించింది. గాండివదారి అర్జున అనే టైటిల్‌ను ఖరారుచేసింది. దీనికి సంబంధించిన చిన్న ప్రోమోను కూడా విడుదల చేసింది. క్లాక్‌ టవర్‌ దగ్గర చూపిస్తూ, గన్‌ లోడింగ్, పదునైన కత్తి, ఆ తర్వాత బాంబ్‌ బ్లాస్ట్‌లు అందులోంచి టెర్రరిస్టును తుదముట్టించి అతనిపై కాలుపెట్టి కుడిచేతితో తుపాకి బయట మరో వ్యక్తికి గురి పెట్టే మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. వెంటనే గాండీవదారి అర్జున అనే టైటిల్‌ పడుతుంది.
 
ఇది వరుణ్‌తేజ్‌ కెరీర్‌లో చేయనటువంటి రోల్‌. సరికొత్త అవతార్‌లో వరుణ్‌తేజ్‌ను చూడనున్నారంటూ చిత్ర యూనిట్‌ తెలియజేసింది. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బివి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ ఎస్‌.వి.సి.సి. బేనర్‌లో నిర్మిస్తున్నారు. మిక్కీ.జె. మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.