శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (13:55 IST)

మా ఇంట్లో స్ట్రాంగెస్ట్ మహిళ శ్రీజ : రామ్ చరణ్

Sreeja Konidala, Ram Charan
Sreeja Konidala, Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సోదరి శ్రీజకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజీస్తూ పోస్ట్ చేశారు. మా ఇంట్లో అత్యంత బలమైన మహిళకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలిపారు. చిరంజీవి, కొణిదల సురేఖల ముద్దుల కుమార్తె శ్రీజ కొణిదల. తను కాస్ట్యూమ్స్ డిసైనర్ గా పనిచేస్తున్నది. చిరంజీవి చేసే సినిమాలకు శ్రీజ కాస్ట్యూమ్స్ డిసైనర్ గా వ్యవహరిస్తూంది. ఆచార్య సినిమాకు శ్రీజ పనిచేసింది. తను లండన్లో ఈ కోర్స్ చేసింది. 
 
Sreeja Konidala,chiru
Sreeja Konidala,chiru
కాగా, శ్రీజ వైవాహిక జీవితంలో కొన్ని ఆటంకాలు కలిగాయి. దానిలోంచి బయట పడటానికి తన టాలెంట్ ప్రూఫ్ చేసుకోవడానికి కాస్ట్యూమ్స్ డిసైనర్ ను ప్రొఫిషన్ గా ఎంచుకుంది. తన మొదటి వివాహం భరద్వాజ, రెండో వివాహం కల్యాణదేవ్ తో జరిగింది. శ్రీజకు ఇద్దరు కుమార్తెలు. ఉన్నది ఉన్నట్లు మాట్లేడే నైజం కలిగిన శ్రీజను ఇంట్లో అందరూ  స్ట్రాంగెస్ట్ మహిళగా పిలుస్తుంటారు. తండ్రిగా చిరంజీవికి శ్రీజ అంటే ఎంతో ప్రేమ. అంతకంటే రామ్ చరణ్ కు ప్రేమ ఉంది.