శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (11:57 IST)

పవన్ కళ్యాణ్ తో వరుణ్ తేజ్.. కాంబో అదిరిపోతుందిగా..

Varun  tej
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వరుణ్ తేజ్ నటించనున్నాడు. ఏపీ రాజకీయాల్లో చురుకుగా వున్న పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సంతకం చేస్తున్నారు. ఇటీవల, నటుడు దర్శకుడు హరీష్ శంకర్‌తో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. తాజాగా ఈ సినిమాలో మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. 
 
మెగా కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మెగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుందని టాక్ వస్తోంది. ఈ వార్త తెలియగానే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా కోసం ధీమాగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.