పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానంటున్న హాస్య నటుడు అలీ
తమ పార్టీ అధినే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను శిరసావహిస్తానని, ఆయన ఆదేశిస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైకాపా నేత, హాస్య నటుడు, ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు.
ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా 175 స్థానాలను గెలుచుకుని తీరుతుందన్నారు. అదేసమయంలో సీఎం జగన్ ఆదేశిస్తే మాత్రం పవన్ కళ్యాణ్‌పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
జగన్ ఆదేశం మేరకు ఎక్కడైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. పవన్ చిత్రాల్లో ఒకటి రెండు మినహా అన్ని సినిమాల్లో నటించానని, ఆయన నాకు మంచి మిత్రుడన్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి రోజా మళ్లీ పోటీ చేసి గెలుస్తారని తెలిపారు.