గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (15:00 IST)

కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

derailed
విశాఖపట్టణం నుంచి కిరండోల్‌కు వెళుతున్న ప్యాసింజర్ రైలు ఒకటి కిరండోల్ వద్ద పట్టాలు తప్పింది. అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన రైలు డ్రైవర్ రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సాంకేతిక సిబ్బంది సాయంతో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎలాంటి చిన్నపాటి గాయం కూడా కాలేదు.
 
ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందిస్తూ, చలికాలం దృష్ట్యా ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పండుగల సెలవుల కారణంగా విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.