1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (19:28 IST)

చెన్నై బీచ్ స్టేషనులో ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన రైలు

train accident
చెన్నై బీచ్ రైల్వే స్టేషనులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఓ సబర్బన్ రైలు అదుపుతప్పి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ విద్యుత్ రైలు నియంత్రణ కోల్పోడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు డ్రైవరు కిందికి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, ఈ రైలు మాత్రం పట్టాలు తప్పి  ఫ్లాట్‍ఫాంపైకి దూసుకెళ్లి అక్కడ నుంచి ఫ్లాట్‌పాంను చివరి భాగాన్ని ఢీకొట్టింది. 
 
ఈ క్రమంలో రైలు ఫ్లాట్‌ఫాంపైకి ఎక్కింది. దీంతో స్టేషన్ పైకప్పు కూడా దెబ్బతింది. రైలు ప్రమాదానికి గురైన సమయంలో రైలులో ప్రయాణికులు లేరు. ఈ రైలు షెడ్డు నుంచి బీచ్ స్టేషన్‌కు వచ్చింది. పైగా, ఆదివారం కావడంతో రైల్వే స్టేషనులో కూడా ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేదు. దీంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. 
 
ఈ ప్రమాదం గురించి దక్షిణ రైల్వే ప్రధాన పీఆర్వో బి.గుహనేశన్ మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన రైలు షెడ్డు నుంచి బీస్ స్టేషన్‌ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపైకి వచ్చిందని. అయితే, నియంత్రణ కోల్పోయిన రైలు ఫ్లాట్‌ఫాంను ఢీకొట్టిందని ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదన్నారు. మరోవైపు, ఈ ప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని తెలిపారు.