1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: మంగళవారం, 17 జనవరి 2023 (15:38 IST)

బోళాశంకర్‌ తాజా షెడ్యూల్‌ షురూ

MeherRamesh,  AnilSunkara
MeherRamesh, AnilSunkara
మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రం విజయోత్సవంలో వుండగానే తన కొత్త సినిమా కోసం జాతర సాంగ్‌ను చేస్తున్నారు. కొల్‌కొత్తా నేపథ్యంలో రూపొందుతోన్న బోళా శంకర్‌ చిత్రం కోసం తాజా షెడ్యూల్‌ మంగళవారంనాడు ప్రారంభమైంది. మియాపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో ఈరోజు అమ్మవారిపై పాటను, ఆ తర్వాత యాక్షన్‌ ఎపిసోడ్‌ను తీయనున్నారు.
 
మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ కొంత భాగం ఇదివరకే పూర్తయింది. వాల్తేరు వీరయ్య ప్రమోషన్‌ కోసం షూటింగ్‌ను వాయిదా వేశారు. వాల్తేరు వీరయ్య కోసం వేసిన జాలరి సెట్‌ సమీపంలోనే బోలాశంకర్‌ కోసం అమ్మవారి సెట్‌ వేశారు. కొల్‌కొత్తా నేపథ్యం గనుక ఆ తరహాలో బెంగాలీ జూనియర్‌ ఆరిస్టులు ఇందులో పాల్గొన్నారు.  తమన్నా భాటియా, కీర్తి సురేష్‌ నటిస్తున్న ఈ సినిమాను అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఫెస్టివల్‌ సందర్భంగా జరగబోయే పాటను ఇందులో చిత్రీకరిస్తున్నారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఇది మలయాళ రీమేక్‌.