బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (12:31 IST)

అక్కినేని తొక్కినేని పై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

balakrishna speach
balakrishna speach
ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబాన్ని తొక్కినేని అంటూ మాట్లాడిన మాటలకు అక్కినేని వారసులు కించిత్‌ కినుక వహించి ట్విటర్‌లో స్పందించారు. అయితే దీనిపై బాలకృష్ణ తన సోషల్‌ మీడియాలోనే ఇలా చేశారు. మనం మాట్లాడే మాటలకు అర్థం పరమార్ధం రెండు ఉంటాయి ఆలోచించే విధానం బట్టి దాని అర్థం చేసుకోవాలా పరమార్ధాలు వెతికి లేని తప్పును ఉన్నట్టు చెప్పటం తప్పు. అంటూ పోస్ట్ చేసారు. 
 
ఆ తర్వాత దానిని చూసిన బాలకృష్ణ అభిమాని క్లారిటీ ఇస్తూ మరో వీడియో పోస్ట్‌ చేశాడు.  స్టేజీపై ఓ రచయితను ఉద్దేశించి నాకు ఈయన మంచి టైంపాస్‌..నాన్నగారు డైలాగ్‌లు శాస్త్రాలగురించి, రంగారావు, అక్కినేని, తొక్కినేని గురించి మాట్లాడుకునేవాళ్ళం. అన్నారు. అప్పుడు అందరూ సరదాగా నవ్వారు. దీని గురించి బాలకృష్ణ అభిమాని వివరణ ఇలా ఉంది. అక్కినేని, తొక్కినేని అనేది రైమింగ్‌లో వెళ్లారు. రంగారావు, అక్కినేని గురించి కంపర్‌ చేయలేదు. తొక్క అనే పదం అనలేదు. కించపరచలేదు. అంటూ వివరించారు.