శుక్రవారం, 9 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: సోమవారం, 30 జనవరి 2023 (16:05 IST)

తారకరత్న ఆరోగ్యంపై ఆందోళనలో సినీపరిశ్రమ

Nandamuri Tarakaratna
Nandamuri Tarakaratna
నందమూరి మోహన కృష్ణ తనయుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై తెలుగు సినిమా రంగంలో పెద్ద చర్చే జరుగుతుంది. షూటింగ్‌లలోనూ ఇదే చర్చ నడుస్తోంది. వయస్సులో వున్న నటుడికి ఇలా ఎందుకు జరిగిందనేది అందరికీ ఆశ్చర్యంగానే వుంది. నారా లోకేష్‌ పాద యాత్ర సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనపై ఫిలింఛాంబర్‌లోని సీనియర్‌ నిర్మాతలు ఆందోళన చెందారు. నందమూరి బాలకృష్ణ కుటుంబం, ఎన్‌.టి.ఆర్‌., కళ్యాణ్‌ రామ్‌ కుటుంబం కూడా హుటా హుటిన బెంగుళూరు నారాయణ హృదయాలయానికి వెళ్ళి ఆరోగ్యం గురించి వాకబు చేయడంపట్ల ఏదో తెలీని దిగులు తెలుగు సినిమారంగంలో నెలకొంది.
 
తాజాగా సోమవారంనాడు స్పెషల్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  పాద యాత్ర సందర్భంగా జనాలను చూసి ఎమోషనల్‌ అయ్యాడా! దాని వల్ల బ్రెయిన్‌కు ఏదైనా అయిందా? లేదా అంతకుముందే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదా? అనే చర్చ కూడా ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. తాజాగా కళ్యాన్‌ రామ్‌ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించనున్న తారకరత్నకు ఇలా జరగడం దిగ్రాంతికి గురి చేసిందని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా ఆయన ఆరోగ్యం నుంచి కోలుకుని బయటపడాలని ఇప్పటికే నందమూరి అభిమానులు పూజలు, హోమాలు చేస్తున్నారు.