కో`స్టార్‌తో క్రష్ వుందన్న దివ్యాంశ కౌశిక్
Divyansha, Sandeep Kishan
నాగచైతన్య మజిలీ, రవితేజతో రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించిన దివ్యాంశ కౌశిక్ తాజాగా మైఖేెల్ సినిమాలో నటించింది. సందీప్ కిషన్ హీరో. ఇందులో తను డాన్స్‌తోపాటు యాక్షన్ సీన్స్‌కూడా చేశానని చెబుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి, పలు పర్సనల్ విషయాలను ఇలా తెలియజేస్తుంది. నాకు సమంత అంటే ఇష్టం. తనే నా ఇన్‌స్పిరేషన్. ఆమెకు బిగ్గెస్ట్ ఫ్యాన్. ఆమె మానవతావాది. మజిలీ సినిమా టైంలో చాలా హెల్ప్ చేసింది. ఆమె అందగత్తె కూడా. అలాంటి ఆమె హెల్త్ కండిషన్ చాలా బాదేసింది. తను స్ట్రాంగ్ పర్సన్ కనుక బయటపడింది అని చెప్పింది.
` కరోనా టైంలో ఏడాదిన్నరపాటు సినిమాలు చేయలేదు. నాకు చాలా బద్ధకం. ఒక్కోసారి డాన్స్ క్లాస్ క్కూడా వెళ్ళేదాన్ని కాదు. అదేవిధంగా నాకు మంచి ఫుడ్ అంటే ఇష్టం. నేను పింక్ సినిమా చూశాక ఏడ్చేశాను. గోల్‌మాల్3లో కరీనాకపూర్, అజయ్‌దేవ్‌గన్ హగ్ చేసుకునేటప్పుడు ఏడుపు వచ్చింది. సినిమాకు అంత పవర్ ఉందని అర్థమయింది. అదేవిధంగా నా కోస్టార్‌తో క్రష్ వుంది. అది ఎవరు? ఏమిటి? అనేది ఇప్పుడే చెప్పను. మైఖైల్ సినిమాతో నాకూ మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను అని చెప్పింది.