బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (16:00 IST)

మైఖేల్ యూనివర్సల్ గా రీచ్ అయ్యే సినిమా : సందీప్ కిషన్

Sandeep Kishan, Divyansha Kaushik, Pushkur Ram Mohan Rao
Sandeep Kishan, Divyansha Kaushik, Pushkur Ram Mohan Rao
మైఖేల్ చాలా ప్రత్యేకమైన చిత్రం. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ .. ఇలా చాలా మంది అద్భుతమైన నటీనటులు ఈ సినిమా కోసం కలసి వచ్చారు. మేమందరం కథని, దర్శకుడు రంజిత్ ని బలంగా నమ్మాం. మా నమ్మకాన్ని ట్రైలర్ కి వచ్చిన స్పందనే నిలబెట్టింది. నిర్మాత భరత్ చౌదరి గారు అద్భుతమైన వ్యక్తి. సినిమా ఈ రోజు ఇంత పెద్దగా మారిందంటే దానికి కారణం భరత్ గారు. అలాగే సునీల్ గారు, రామ్ మోహన్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి అన్ని కలిసొచ్చాయి. కథ, కంటెంట్, ఫిల్మ్ మేకింగ్ పరంగా  మైఖేల్ యూనివర్సల్ గా రీచ్ అయ్యే సినిమా. చాలా ఒర్జినల్ ఫిల్మ్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని సందీప్ కిషన్ అన్నారు.
 
హీరో సందీప్ కిషన్ రొమాంటిక్ యాక్షన్-ప్యాక్డ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘’మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా  నిర్మించాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. 
 
దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ.. మైఖేల్ ఫిబ్రవరి 3 న విదులౌతుంది. ఈ కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేశాం. ముఖ్యంగా సందీప్, దర్శకుడు రంజిత్ ఫిజికల్ గా మెంటల్ గా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ టీంతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే వరుణ్ గారు సరికొత్త స్వాగ్ తో తెరపై కనిపిస్తారు. అందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు    
 
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘మైఖేల్’ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. సందీప్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా సందీప్ కోసం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో సందీప్ నెక్స్ట్ లీగ్ కి వెళ్తాడని చాలా నమ్మకంగా వున్నాను. భరత్ చౌదరి గారి ప్రొడక్షన్ లో పని చేయడం ఇదే మొదటి సారి. దర్శకుడు రంజిత్ తో పాటు వండర్ టీం కలసి పని చేసాం. దివ్యాంశం చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో చాలా మంది నతీన్నటులు వున్నారు. ఫిబ్రవరి 3 మీ అందరూ ఈ సినిమాని చూసి చాలా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను.