శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (17:23 IST)

టాప్ గేర్ తో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగిపోవాలి : సందీప్ కిషన్

saikumar, adi, Sandeep Kishan and others
saikumar, adi, Sandeep Kishan and others
`శశి  నాకు ఏడు సంవత్సరాలనుండి మంచి ఫ్రెండ్.తను ఈ సినిమాకు దర్శకత్వం వహించడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్థానం సినిమాతో  నా జర్నీ  స్టార్ట్ అయింది. ఆ సినిమాకు నేను కొత్త అయినా సాయి కుమార్ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్.  ఈ సినిమాలో తను చాలా బాగా నటించాడు.తనకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ "టాప్ గేర్" సినిమాతో ఆది కేరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి. అలాగే రాబోయే 2023 లో ఆది తో నేను ఒక సినిమా తియ్యడానికి ప్లానింగ్ చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ "టాప్ గేర్" సినిమా నిర్మాత శ్రీధర్  రెడ్డి గారికి, శశికి టెక్నిషియన్స్ అందరికీ ఈ సినిమా పెద్ద విజయం  సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను` అని హీరో సందీప్ కిషన్  అన్నారు.
 
ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో  K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర  యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. 
 
చిత్ర నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..* దర్శకుడు  శశి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. హీరో, హీరోయిన్స్ ఆది, రియా లిద్దరూ చాలా బాగా నటించారు.ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్ అవ్వనుంది. ఈ సినిమాకు పని చేసిన వారందరూ తమ సినిమా అనుకొని ఓన్ చేసుకొని ఈ సినిమాకు వర్క్ చేయడం వలన ఈ సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు.
 
ఆది సాయికుమార్ మాట్లాడుతూ..* శ్రీధర్ గారు చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి. సినిమాను ఇంకా బాగా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకునే వ్వక్తి. తను ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తియ్యాలి. శశి చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు. సాయి శ్రీరామ్ ఫ్రెమింగ్ చాలా బాగుంటుంది. తను నన్ను, రియా ను చాలా బాగా చూపించారు..హర్ష  గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల వెన్నెల పాట పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. దీంతో సినిమా మీద ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. టెక్నిషియన్స్ అందరు ఫుల్ సపోర్ట్ చేశారు. అందుకే సినిమా బాగా వచ్చింది..ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు శశికాంత్ మాట్లాడుతూ...* థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ  ఉన్న సినిమాకు  ప్యాషన్ ఉన్న  ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారు లభించడమే కాకుండా ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకోవడం  అదృష్టంగా భావిస్తున్నాను. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. హర్ష గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అందుకే సినిమా చాలా బాగా వచ్చింది.ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
ఇంకా హీరోయిన్ రియా,  మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి  మాట్లాడుతూ , నిర్మాత శ్రీధర్ రెడ్డి గారికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమానికి  సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి  తదితరులు ముఖ్య అతిదిలుగా పాల్గొన్నారు. హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు టాప్ గేర్ బిగ్ టికెట్ ను  లాంచ్ చేశారు.