ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (13:13 IST)

ఘనంగా నటి పూర్ణ సీమంతం వేడుక

poorna
దక్షిణాది చిత్రసీమలో తన కంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న నటి పూర్ణ. బుల్లితెరపై అనేక కార్యక్రమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అదేసమయంలో ఇటీవల వివాహం చేసుకున్న ఆమె గర్భందాల్చారు. తాను తల్లికాబోతున్నట్టు కొన్ని ఫోటోలు కూడా చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆమెకు సీమంతం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
అత్యంత బంధు మిత్రుల మధ్య ఈ సీమంతం వేడుకలు జరిగాయి. ఈ ఫోటోను నటి పూర్ణ కూడా తన ఇన్‌స్టా ఖాతాలో కూడా షేర్ చేశారు. కాగా, ఆమె కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్తను గత యేడాది అక్టోబరు నెలలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, అంతకుముందు నుంచే ఆమె ఆ వ్యాపారవేత్తతో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం.