గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (12:01 IST)

టాలీవుడ్ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు సూపర్ స్టార్ ఫోన్‌ కాల్

gopichand malineni
టాలీవుడ్ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. ఈ విషయాన్ని గోపీచంద్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో "వీరసింహారెడ్డి" చిత్రం వచ్చింది. ఇది ఘన విజయం సాధించింది. 
 
పైగా మంచి వసూళ్లను రాబట్టింది. బాలయ్య మాస్ అప్పీరెన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని గోపీచంద్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి అభినందించినట్టు దర్శకుడు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
"ఇది నాకు నమ్మలేని నిజం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన "వీరసింహారెడ్డి" సినిమను చూశారు. ఆయనకు ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో తనకు అన్నింటికంటే ఎక్కువ. థ్యాంక్యూ రజనీ సార్" అంటూ ట్వీట్ చేశారు.