అనుమతి లేకుండా ఫోటో - పేరు వాడితే చర్యలు : రజనీకాంత్ న్యాయవాది హెచ్చరిక
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక చేశారు. తన పేరు, ఫోటోలను వాణిజ్య ప్రకటనల్లో అనుమతి లేకుండా వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రజనీకాంత్ తరపు న్యాయవాది ఓ బహిరంగ హెచ్చరిక చేశారు. ఇదే విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
"రజనీకాంత్ ఓ సెలెబ్రిటీ హోదాలో ఉన్నారు. వాణిజ్యపరంగా రజనీకాంత్ వ్యక్తిత్వం, పేరు, మాటలు, ఫోటోలు ఉపయోగించే హక్కులపై ఆయనకే నియంత్రణ ఉంటుంది. కొన్ని వేదికలు, మధ్యమాలు, ఉత్పత్తుల తయారీదారులు రజనీకాంత్ పేరు, మాటలు, ఫోటోగ్రాఫ్, వ్యంగ్య చిత్ర, నటనకు సంబంధించిన చిత్రాలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజాదారణను పొందుతూ తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా లేదా తమ ఫ్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెంచుకునే చర్యలకు పాల్పడుతున్నారు.
నటుడు, మానవతావాది కావడం, ఆయనుకున్న ఆకర్షణతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది సూపర్‌స్టార్‌గా పిలుస్తున్నారు. చలనచిత్రపరిశ్రమలో ఆయనకున్న గౌరవం అభిమానుల సంఖ్య సాటిలేనిది. వివాదం లేదని. ఆయనకున్న ప్రతిష్ట లేదా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే అది నా క్లయింట్‌కు ఎంతో నష్టం" అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.