గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (16:46 IST)

సంక్రాంతికి పాత పద్ధతే పునరావృతం, కానీ సినిమాల్లో ప్రత్యేకత వుంది

balakrishna, chiru katouts
balakrishna, chiru katouts
ప్రతి ఏడాది సంక్రాంతికి తెలుగులో సినిమాలు అగ్రహీరోలవే విడుదల కావడం రివాజు. అగ్రహీరోల సినిమాలు విడుదలయినప్పుడు సందడిలో సడేమియాలా చిన్న సినిమాలు ఒకటి, రెండు విడుదల కావడం కూడా జరుగుతుంది. ఒకప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి సినిమా రోజే శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌ విడుదలయి రికార్డ్‌ సృష్టించింది. అసలు శేఖర్‌ కమ్ముల ఎవరో జనాలకు తెలీదు. చిన్న సినిమా అనుకున్నారు. కానీ అదే అప్పటి యూత్‌కు నచ్చి బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు జరిగేవి. 
 
అలాగే సంక్రాంతికి తెలుగు సినిమాతోపాటు తమిళ డబ్బింగ్‌ కూడా విడుదలయ్యేవి. రజనీకాంత్‌, అజిత్‌, విజయ్‌ ఇలా వారి సినిమాలు విడుదలయి బాగానేఆడేవి. కానీ రానురాను పెద్ద హీరోల చిత్రాలపై విమర్శలు రావడంతో చిన్న నిర్మాతలు తమ సినిమాలు విడుదలచేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మరలా పాత పద్ధతిలోనే తెలుగు సినిమా పయనిస్తోంది. ఇందుకు నిదర్శనం బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రెండూ సంక్రాంతికి విడుదలకావడమే.
 
వీరిద్దరి సినిమాల వల్ల మిగతా ఏ సినిమాలు విడుదలకు నోచుకోలేకపోతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. మూడో సినిమాగా దిల్‌రాజు నిర్మానంలో వస్తున్న తమిళ విజయ్‌ ‘వారసుడు’ రాబోతుంది. ఇది పక్కా డబ్బింగ్‌ సినిమా అనీ, కాదు ఇది స్ట్రెయిట్‌ సినిమా అని నిర్మాత దిల్‌రాజు అప్పట్లో సినిమా  ఇండస్ట్రీ షూటింగ్‌ బంద్‌ పాటిస్తున్నప్పడు రెండు రకాలుగా వ్యవహించాడు. ఇక ఈసారి సంక్రాంతి సినిమాలకు ఓ ప్రత్యేకత వుంది. అదేమిటంటే..
 
రెండు సినిమాల పేర్లలోనూ 'వీర' అనే అక్షరాలుండటం.. రెండు సినిమాలూ ఒకే ప్రొడక్షన్ నుంచి రావడం..రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ అవ్వడం.. రెండు సినిమాల దర్శకులూ వారి వారి హీరోల అభిమానులే కావడం.. రెండు సినిమాల హీరోలూ దశాబ్దాలపాటు పోటీపడుతున్న సమఉజ్జీలే అవ్వడం..
 
91ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి జరుగుతున్న విచిత్రమితి.. ఇక రెండూ సూపర్ హిట్లయితే లెక్క సరిపోద్ది.. ఏదేమైనా సంక్రాంతి పందెంకోళ్లంటే వీళ్లిద్దరే..  వీళ్లు పోటీపడితే వచ్చే కిక్కూ.. పాన్ ఇండియా హీరోలు పోటీపడ్డా రాదేమో.