బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (12:47 IST)

నలుపు డ్రెస్‌లో సూపర్ స్టైలిష్‌గా పవన్ కల్యాణ్ (video)

Pawan Kalyan
Pawan Kalyan
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో మూవీ ఫేమ్ దర్శకుడు సుజీత్ కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం చేతులు కలిపారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. 
 
పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను నలుపు డ్రెస్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ వేడుకకు నటుడి ఎంట్రీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు నటించనున్నారు. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో వెలువడే అవకాశం ఉంది.