శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (07:11 IST)

రక్షితతో శర్వానంద్ నిశ్చితార్థం

sarvandh with mytri movie moakers
sarvandh with mytri movie moakers
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన యంగ్ హీరో శర్వానంద్ త్వరలో తన బ్యాచిలర్‌హుడ్‌ని ముగించబోతున్నాడు. మైనేని వసుంధరా దేవి, మైనేని రత్నగిరి వర ప్రసాదరావుల కుమారుడు శర్వా, టెక్కీ అయిన రక్షితతో వివాహం జరగనుంది. రక్షిత హైకోర్టు న్యాయవాది పసునూరు మధుసూధన్ రెడ్డి, పసునూరు సుధా రెడ్డిల కుమార్తె.
 
రిపబ్లిక్ రోజు పార్క్ హయత్ హోటల్లో  శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది, కుటుంబ సభ్యులు, బంధువులు మరియు సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారు.
 
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, నాగార్జున కుటుంబం, రామ్ చరణ్, ఉపాసన, అఖిల్, నాని, రానా దగ్గుబాటి, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, నితిన్, శ్రీకాంత్, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ మరియు రవి, సితార నాగ వంశీ, నిర్మాత చినబాబు, దర్శకుడు క్రిష్, సుధీర్ వర్మ, చందూ మొండేటి, వెంకీ అట్లూరి, అభిషేక్ అగర్వాల్, సుప్రియ, స్వప్న దత్, ఏషియన్ సునీల్, సుధాకర్ చెరుకూరి, దేవా కట్టా, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, విక్రమ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
 
హీరో శర్వానంద్ & రక్షిత గ్రాండ్ ఎంగేజ్‌మెంట్ వేడుక స్టిల్స్