గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (13:14 IST)

ప్రియుడు అసిఫ్ అలీని పెళ్లాడిన నటి పూర్ణ

poorna marriage
ప్రముఖ సినీ నటి, డీ డ్యాన్స్ షో న్యాయనిర్ణేత పూర్ణ ఓ ఇంటికి కోడలైంది. తన ప్రియుడు అసిఫ్ అలీని ఆమె వివాహం చేసుకున్నారు. వీరి వివాహం దుబాయ్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అతికొద్దిమంద్రి స్నేహితులు, ఇరు కుటుంబాలకు చెందిన సభ్యుల మాత్రమే హాజరయ్యారు. 
 
గత కొంతకాలంగా పూర్ణ దుబాయ్‌కు చెందిన పారిశ్రామికవేత్త షానిద్ అసిఫ్ అలీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదనే ప్రచారం కూడా జరిగింది. కానీ వీరి వివాహం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
"నేను ప్రపంచంలోనే అందమైన మహిళను కాకపోవచ్చు. మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉండకపోవచ్చు. కానీ, నన్ను నా కంటే తక్కువగా ఊహించుకునేలా మీకు ఎపుడు చేయలేదు. మీరు నన్ను ఎంతో అభిమానించారు. నన్ను మార్చడానికి ఎపుడూ ప్రయత్నించలేదు. 
 
నాలో ఉన్న ఉత్తమమైన వాటిని బయటకు తీసుకునిరావడానికి ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజున మన ప్రియతముల మధ్య ఇద్దరం కలిసి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాను. జీవితంలో వచ్చే సుఖదుఃఖాలన్నింటనీ మీతో కలిసి పంచుకుంటూ సంతోషకర జీవితాన్ని గడుపుతా" అంటూ నటి పూర్ణ తన భర్తను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.