సంబంధిత వార్తలు
- TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు
- Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్
- తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)
- అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)
- Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
వీఆర్వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)
కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడపడితే మహిళలను వేధిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో అఘాయిత్యం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం వుంటున్న ఓ మహిళా వీఆర్వోను ఓ ఎమ్మార్వో కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధించే వాడని.. 'మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా? కోడికూర వండిపెడతావా?' అంటూ అతడు మెసేజ్‌లు పెట్టాడు. దీంతో బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. అంతేగాకుండా.. బుధవారం రాత్రి, ఈ ఎమ్మార్‌ఓ బరితెగించి మహిళా వీఆర్‌ఓ ఇంటికి వెళ్లాడు.
షర్ట్ విప్పి, తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ఘటన గురించి తెలుసుకున్న వీఆర్‌ఓ తల్లి సమయస్ఫూర్తితో స్పందించి, ఆ ఎమ్మార్‌ఓను చితకబాదింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటికి వస్తా... కోడికూర వండిపెడతావా? అంటూ మహిళా VROకు అసభ్యమైన మెసేజ్‌లు పంపిన MRO
— N Media News (@NMediaNewsOffl) July 31, 2025
కొంతకాలంగా లైంగిక వేధింపులు కొనసాగిస్తూనే, నిన్న బరితెగించి ఆమె ఇంటికొచ్చి దుస్తులు విప్పి కోరిక తీర్చాలంటూ పీడించాడు!
అక్కడే తన తల్లికి చెప్పిన VRO... వెంటనే ఇంటికి వచ్చి MROను చితకబాదింది. pic.twitter.com/Kw7jwVibNh
