మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (22:49 IST)

తారకరత్నకు గుండెపోటు.. బాలయ్యకు ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్?

నందమూరి హీరో తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకుని బాలయ్య ఆస్పత్రికి చేరుకుని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ క్రమంలో తారకరత్న సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ప్రాణాపాయం ఏమి లేదని బాలయ్య ఎన్టీఆర్‌కు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మీడియాతో కూడా బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని.. మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఇంకా మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలయ్య మీడియాకు వివరించారు.