గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (12:19 IST)

మామయ్య బాలకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు.. ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర

nara lokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. సరిగ్గా శుక్రవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. 
 
అంతకుముందు ఆయన కుప్పంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో తన మామయ్య బాలకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 11.03 గంటలకు పాదయాత్రను మొదలుపెట్టారు. 
 
ఆయనతో పాటు బాలకృష్మ, పలువురుల టీడీపీ నేతలు, వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఈ పాదయాత్రలో భాగస్వాములై ముందుకుసాగుతున్నారు. ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు సుధీర్ఘంగా కొనసాగనుంది. కుప్పం నుంచి బయలుదేరిన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.