గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (16:10 IST)

లోకేశ్ పాదయాత్రలో ముద్దులు పెట్టుకోవడం ఉండవు : అచెన్ననాయుడు

atchennaidu
తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వచ్చే నెలలో యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేడుతారని, ఈ పాదయాత్రలో ముద్దుపెట్టుకోవడం, షాపులో తల స్నాలు చేయడం వంటివి ఉండవచి తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు చెప్పారు. 
 
ఈ పాదయాత్రపై అచ్చెన్న మాట్లాడుతూ, ఈ పాదయాత్రలో ముద్దులు పెట్టుకోవడం, షాంపూలతో తల రుద్దడం వంటివి ఉండవన్నారు. పైగా, జగన్ పాదయాత్ర తరహాలో లోకేశ్ పాదయాత్ర అండబరంగా ఉంటుందని చెప్పారు. యువతకు అండగా ఉండేందుకే ఈ పాదయాత్రను చేపడుతున్నారని చెప్పారు. 
 
రాష్ట్రంలో మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని, యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావడం లేదని, ఉన్న సంస్థలో వెళ్లిపోతున్నాయని చెప్పారు. 
 
యువతకు ఉపాధి ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుంత విపక్షంలో ఉన్నాం కాబట్టి ఉద్యోగాలు నోటిఫికేషన్లను ఇవ్వలేమని అన్నారు. 9686296862కి మిస్డ్ కాల్ ఇచ్చి ఈ యువగళం కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.