గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (15:32 IST)

జనవరి 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర

nara lokesh
కొత్త సంవత్సరంలో జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి పర్యటనలో ఉన్న ఆయన కార్యకర్తలతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, జనవరి 27వ తేదీన ప్రారంభమయ్యే తన పాదయాత్ర మొత్తం 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 
 
మంగళగిరిలో సెగ్మెంట్‌లో తన పాదయాత్ర నాలుగు రోజుల కొనసాగుతుందని ఆయన తెలిపారు. అదేసమయంలో పాదయాత్ర దృష్ట్యా తాను నియోజకవర్గానికి ఒక యేడాది పాటు దూరంగా ఉంటానని తెలిపారు. అందువల్ల మంగళగిరినే కాదు.. తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించే బాధ్యతలను తాను భుజాన వేసుకోనున్నట్టు తెలిపారు.