శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (22:01 IST)

తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జడుసుకుంటుంది : నారా లోకేశ్

naralokesh
తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జడుసుకుంటుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. తాడేపల్లి పులిగా తనను తాను అభివర్ణించుకున్న జగన్ రెడ్డి ఇపుడు తాడేపల్లి పిల్లిగా మారిపోయారన్నారు. 
 
రాష్ట్రంలోని జిల్లాల్లో విపక్ష నేతల పర్యటనలను చూసి జడుసుకుంటుందని, అందుకే అనుమతులు మంజూరు చేయడం లేదన్నారు. దీనికి కారణం తాడేపల్లి ప్యాలెస్ పిల్లి భయపడింది అంటూ ఓ సింగిల్ కామెంట్స‌తో ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన తన కడప జిల్లా పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదట. ఈ విషయాన్ని తెలియజేస్తూ కడపకు చెందిన టీడీపీ నేత రామ ప్రసాద్‌కు రిమ్స్ పోలీసులు ఓ నోటీసును జారీ చేశారు.
 
ఇందులో "అనుమతి లేకుండా కడప జిల్లాకు వస్తున్న నారా లోకేశ్ పర్యటనలో మీరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని సదర నోటీసుల్లో రామప్రసాద్ క రిమ్స్ పోలీసులు సూచించారు. 
 
తమ సూచనలను పట్టించకోని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామప్రసాద్ ను పోలీసులు హెచ్చరించారు. ఈ నోటీసు కాపీని తన పోస్ట్‌కు జత చేసిన నారా లోకేశ్ పై కామెంట్ చేశారు.