శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (14:40 IST)

హిమాలయ లెహ్ సెక్టార్‌లో నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్

nara brahmani
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి హిమాలయ పర్వత శ్రేణుల్లో బైక్ రైడింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. 
 
ఈ మోటార్ బైక్‌లను తయారు చేసే సంస్థ ఎంతో ఉత్సాహవంతులైన బైకర్లను ఒక జట్టుగా ఎంపకి చేసి అడ్వెంచర్ డ్రైవ్‌ను నిర్వహించింది. తాజాగా ఈ అడ్వెంచర్ రైడ్ లడఖ్ నుంచి లేహ్ సెక్టార్ వరకు సాగింది. ఇందులో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. 
 
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలిగానే కాకుండా అన్నింటికి మించి మహిళా వ్యాపారవేత్తగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఈమె మంచి బైకర్ కూడా బైక్ రైడింగ్‌ దృశ్యాలతో కూడిన వీడియోను జావా యెజ్డీ మోటార్ సైకిల్ సంస్థ షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.