లడఖ్ అందాలు.. బ్రాహ్మణి బైక్ రైడింగ్.. వీడియో అదుర్స్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి తన పసుపు రంగు జావా బైక్‌పై లేహ్-లడఖ్ అందాలను తిలకించిన విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి.
నారా బ్రాహ్మణి లేహ్ పర్వత శ్రేణులలో బైక్ యాత్రను ఆస్వాదించారు. వైరల్ వీడియోలో, నారా బ్రాహ్మణి థిక్సే మఠం అందించే సూర్యోదయం, ఆధ్యాత్మికత గురించి వివరిస్తున్నారు.
ఫిజికల్ చాలెంజింగ్ జర్నీగా సాగిన బ్రహ్మణి బైక్ ట్రిప్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నారా బ్రాహ్మణికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె విజయవంతమైన వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే.