బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపాకు ఇవే చివరి ఎన్నికలు - టీడీపీకి 160 సీట్లు ఖాయం : అచ్చెన్న జోస్యం

atchannaidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార వైకాపా విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా, ఆ పార్టీ ప్రజావ్యతిరేక పాలనను తూర్పారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. పార్టీ కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నారనీ, కానీ పార్టీ నేతలే సిద్ధంగా లేరన్నారు. అందరూ కలిసి పని చేస్తే టీడీపీకి 160 సీట్లు కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరన్నారు. అయితే, విజయం తథ్యమనే ధీమాతో మాత్రం ఉండొద్దని ఆయన పిలుపునిచ్చారు. 
 
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇవే తన చివరి ఎన్నికలు అంటే.. వైకాపా నేతలు పిచ్చికుక్కల్లా మాట్లాడారన్నారు. నిజమే.. చివరి ఎన్నికలే.. జగన్ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కల్పించడానికి చివరి ఎన్నికలన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. జనాల మధ్య చిచ్చుపెట్టి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 
 
గత మూడున్నరేళ్లలో ఎంతో మంది పార్టీకార్యకర్తలు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అయినా ఏమాత్రం పట్టించుకోని పోలీసులు ఇపుడు జగన్ కటౌట్‌కు తగలబెడితే ఏకంగా డాగ్ స్క్వాడ్‌నే రంగంలోకి దించి నిందితులను గాలించడం వారికే చెల్లిందన్నారు. దీన్నిబట్టి చూస్తే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
ఏపీకి జగన్ ఓ ఐరెన్ లెగ్ అని, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పర్యటనలో సమయంలో వైకాపా కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లు విసిరితే పోలీసులకు ఫిర్యాదు చేయబోమని, అదే ప్లేసులో వైకాపా వాళ్ళకు బుద్ధి చెబుతామని అచ్చెన్నాయుడు ఆరోపించారు.