శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (11:15 IST)

ఫోన్ మరిచిపోయిన ప్రయాణీకుడు.. సాహసం చేసిన పైలట్ (video)

Pilot
Pilot
ప్రయాణీకుడు ఫోన్ మరిచిపోయాడు. అయితే ప్రయాణీకుడి ఫోన్ కోసం పైలట్ సాహసం చేశాడు. ఒక కస్టమర్ తన మొబైల్‌ను గేటు దగ్గర వదిలివెళ్లి ఫ్లైట్ ఎక్కినట్లు విమానాశ్రయ ఉద్యోగులు గుర్తించారు. 
 
దీంతో కాక్‌పిట్ కిటికీలోంచి వేలాడుతూ పైలట్‌కు ప్రయాణికుడి మొబైల్‌ను అప్పగించేందుకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సాహసం చేసిన వీడియోను సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. 
 
గేట్‌ వద్ద మరిచిపోయిన ప్రయాణికుడి ఫోన్‌ని తీసుకెళ్లేందుకు పైలట్‌ విమానం కిటికీలోంచి వేలాడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన లాంగ్ బీచ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.