గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (11:57 IST)

స్వామి మాల ముసుగులో టీడీపీ నేతపై దాడి...

knife attack
కాకినాడ జిల్లాలోని తునిలో దారుణం జరిగింది. స్వామి మాల ముసుగులో ఓ దుండగుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేతపై దాడి జరిగింది. బాధితుడు మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావు. ఈయనపై హత్యాయత్నం జరిగింది. 
 
స్వామి మాల వేసుకున్న దుండగుడు భిక్ష తీసుకుంటున్న సమంయలో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరి రావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు తల, చేతికి బలమైన కత్తిగాయాలయ్యాయి. ఈ దాడిని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి తర్వాత దుండగుడు బైకుపై పరారయ్యాడు. 
 
సమాచారం అందుకున్న తుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, ఆ దాడివార్త తెలుసుకున్న పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప తదితరులు ఆస్పత్రికి వెళ్లి శేషగిరిరావును పరామర్శించారు.