గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (10:22 IST)

డిసెంబరు 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

parliament
ఈ యేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు ఏడో తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
డిసెంబరు 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు 29వ తేదీ వరకు మొత్తం 23 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, అనేక అంశాలపై చర్చ సాగుతుందని, నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
 
శీతాకాల సమావేశాల్లో డీపీడీపీ బిల్లు 
కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. స్త్రీపురుష, నపుంసక లింగాల్లో ఏది అయినప్పటికీ అందరినీ ఆమెగానే సంబోధించేలా బిల్లును రూపొందిస్తుంది. ఇందుకోసం "డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్" బిల్లును రూపకల్పన చేసి వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించనుంది. 
 
"బేటీ బచావో.. బేటీ పడావో" స్ఫూర్తిగా కేంద్రం ప్రభుత్వం ఓ సరికొత్త బిల్లును తీసుకునిరానుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ పేరుతో ఈ బిల్లును తీసుకొస్తుంది. పైగా, దీన్ని వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా బిల్లులో స్త్రీలు, పురుషులు, నపుంసక లింగలకు చెందిన వారందరిని ఆమె అనే పద ప్రయోగం చేశారు. 
 
వారు ఏ వర్గానికి చెందినవారైనా సరే అంటే స్త్రీ, పురుషుడు, నపుంసక లింగాల్లో ఎవరైనప్పటికీ ఆ వ్యక్తిని సంబోధించేటపుడు ఆమె లేదా ఆమెను అనే పదాలను ఉపయోగించాలని ఈ ముసాయిదా బిల్లు చెబుతోంది. మహిళలను సాధికారులను చేయాలన్న ప్రభుత్వం సిద్ధాంతానికి అనుగుణంగా ఈ మాటలు ఉపయోగించినట్టు ఈ ముసాయిదా బిల్లు చెబుతోంది.