ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (10:47 IST)

శ్రీవారి సేవలో నారా లోకేశ్ - రేపటి నుంచి పాదయాత్ర

nara lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం రాత్రికే తిరుమల క్షేత్రానికి చేరుకుని, గురువారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయన రాకతో తిరుమల, తిరుపతిలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహంతో పాటు కోలాహలం నెలకొంది. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల స్వామివారిని దర్శనం తర్వాత కుప్పం చేరుకుని రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురం నుంచి వరదరాజులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తాను యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభిస్తారు. 
 
ఇందులోభాగంగా, కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత గుడుపల్లె మండలం శెట్టిపల్లికి చేరుకుంటారు. రాత్రికి పీఈఎస్ మెడక్ల కాలేజీ ఎదుట ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో లోకే‌శ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడ నుంచి ఆయన శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు.