కడప వైకాపా ఎంపీ అవినాశ్‌కు సీబీఐ మళ్లీ నోటీసులు
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైపాకాకు చెందిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ మరోమారు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేయగా, బుధవారం మరోమారు జారీచేసింది. జనవరి 28వ తేదీన తర్వాత తమ హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని తాజా నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
కాగా, వివేకా హత్య కేసును సీబీఐ గత మూడున్నరేళ్లుగా హత్య చేస్తుంది. గత 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ ప్రధానంగా అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో వీరిద్దరినీ ఇప్పటివరకు సీబీఐ విచారించలేదు.
ఈ పరిస్థితుల్లో తొలిసారి ఆయనకు విచారణకు రావాల్సిందిగా మూడు రోజుల క్రితం సీబీఐ ఆదేశాలు జారీచేసింది. అయితే నోటీసుల ఇచ్చిన వెంటనే విచారణకు రావాలంటే ఎలా అని అవినాశ్ మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో సీబీఐ ఈ దఫా 28వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొంటూ తాజాగా నోటీసులు జారీచేసింది.