సీబీఐ అధికారుల వేషంలో రూ.30లక్షలు దోపిడీ
సీబీఐ అధికారుల వేషంలో వ్యాపారి ఇంట్లో రూ.30 లక్షలు దోపిడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎనిమిది మంది వ్యక్తులు 3 వాహనాల్లో వచ్చారు. తమను తాము సీబీఐ అని చెప్పుకున్నారు. ఆపై ఆ ఇంట్లో 30 లక్షల రూపాయలను దోపిడీ చేసుకుని పరారైనారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సిబిఐ నమోదు చేశారు. దొంగల కోసం అధికారులు గాలిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌లోని రూప్‌చంద్ ముఖర్జీ లేన్‌కు చెందిన సురేష్ వాధ్వా (వయస్సు 60). వ్యాపారవేత్త. 8 మందితో కూడిన బృందం 3 వాహనాల్లో ఆయన ఇంటికి వచ్చారు.
తమను తాము సీబీఐ అని పిలుచుకున్నారు. ఆపై దాడి పేరుతో రూ.30 లక్షల నగదు, లక్షల రూపాయల విలువైన నగలు దోచుకెళ్లారు. సురేష్ వాధ్వా భవానీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వున్న దోపిడీదారుల గురించి దర్యాప్తు జరుపుతున్నారు.