బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (17:01 IST)

వైకాపా మహిళా నేత ఇంట్లో నకిలీ నోట్లు స్వాధీనం

rajaputra rajini
ఏపీకి చెందిన అధికార వైకాపా పార్టీకి చెందిన మహిళా నేత రసపుత్ర రజినీ నకిలీ నోట్ల కేసులో బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వద్ద నుంచి రూ.44 లక్షల విలువైన రూ.500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈమె రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టరుగా కూడా వ్యవహించారు. ఈమె పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. దీంతో మరోమారు రజినీకిఆ ఆ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. 
 
కాగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన  రజినీ.. అధికార వైకాపాలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆమె నుంచి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం ఇపుడు కలకలం రేపింది. అనంతపురం పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి ఆమె నకిలీ నోట్లు కొనుగోలు చేసి వాటిని బెంగుళూరులో సర్క్యులేట్ చేస్తున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు.