శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (21:44 IST)

మద్యం మత్తులో మహిళ.. బిర్యానీ ఆర్డర్ చేస్తే రూ.2500 గోవిందా..

మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ బిర్యానీ ఆర్డర్ చేయగా, బిర్యానీ ధర రూ.2500 ఉండటం చూసి షాక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళ మద్యం మత్తులో జోమైటాలో బిర్యానీ ఆర్డర్ చేసింది.
 
ఆమె ఇచ్చిన ఆర్డర్ కూడా ఇంటికి చేరింది. అయితే ఆమె ఖాతా నుంచి రూ.2500 కట్ అయ్యింది. అయితే బిర్యానీ ధర రూ.2500లని మెసేజ్ చూడగానే ఆమె షాక్ అయ్యింది. ఇంకా ఆ తర్వాతే తన తప్పు కూడా తెలుసుకుంది.
 
ముంబైలో వుంటున్న ఆమె బెంగుళూరులోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది. బెంగళూరు నుంచి ముంబైకి తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చుతో కలిపి రూ.2500 వసూలు చేశారు. ఇలా తన తప్పును తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ పోస్ట్‌కి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి.