ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 జనవరి 2023 (15:53 IST)

ప్రియురాలి కోసం పురుషుడిగా మారిన యువతి... ఇపుడు వద్దంటూ ట్విస్ట్

gender change lovers
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు అమ్మాయిలు గాఢంగా ప్రేమించుకున్నారు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఓ అమ్మాయి పురుషుడిగా లింగ మార్పిడి చేయించుకుంది. ఇందుకోసం రూ.6 లక్షల వరకు ఖర్చు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 2017లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కాపురం తర్వాత ప్రియురాలు మనస్సు మార్చుకుంది. తాను వేరే యువకుడి ప్రేమలోపడింది. ఫలితంగా తన కోసం లింగమార్పిడి చేయించుకున్న ప్రియుడిని వద్దంటోంది. తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. 
 
యూపీలోని ఝాన్సీ జిల్లాకు చెందిన సనాఖాన్, సొనాల్ శ్రీవాత్స అనే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. పెళ్లికి పెద్దల నుంచి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వారిలో ఒకరు లింగ మార్పిడి చేయించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పురుడిగా మారిన యువతి తన పేరును సుహైల్ ఖాన్‍‌గా మార్చుకుంది. 
 
ఇంతకాలం వారిజీవితం సాఫీగానే సాగిపోయింది. ఇపుడు ఉన్నట్టు సొనాల్ శ్రీవాత్సవ ఫ్లేటుఫిరాయించింది. నీతో కలిసి  ఉండలేనంటూ సుహైల్‌కు తేల్చి చెప్పింది. దీంతో నిర్ఘాంతపోయిన సుహైల్ ఖాన్ కోర్టును ఆశ్రయించాడు. తనను వివాహం చేసుకున్న తర్వాత సోనాల్‌కు ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చిందని, అక్కడు ఓ యువకుడితో ప్రేమలో పడిందని ఈ కారణంగానే తనను వద్దంటోందని కోర్టుకు తెలిపింది. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు సోనాల్ శ్రీవాత్సవకు నోటీసులు పంపించింది. ఆమె ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అరెస్టు చేసి హాజరుపరచాలంటూ ఆదేశించింది. దీంతో పోలీసులు ఈ నెల 18వ తేదీన ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఈ కేసును వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు.