బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (14:47 IST)

విమానంలో ప్రేయసికి ప్రపోజ్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్

Love
ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి తన ప్రేయసిని ముంబైకి ప్రయాణిస్తున్న అదే విమానంలో టికెట్ బుక్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఉంగరంతో ప్రపోజ్ చేయడానికి ఒక మోకాలిపై వెళ్లిపోయాడు. లింక్డ్ఇన్ లో రమేష్ కొట్నానా అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియా యూజర్ల నుంచి మంచి స్పందనలు అందుకుంది. 
 
విమానంలో జరుగుతున్న ఈ ప్రపోజల్ కు యువతి ఫిదా అయ్యింది. "మై గాడ్!" అని ఆశ్చర్యపోయింది. ఇంకాఆ వ్యక్తిని కౌగిలించుకుని, అతనికి ముద్దు పెట్టింది. బ్యాక్ గ్రౌండ్ లో తోటి ప్రయాణీకులు చప్పట్లు కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో ఆ వ్యక్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది దీనిని "నిజమైన ప్రేమ" అని పిలుస్తున్నారు.