1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (21:17 IST)

వారసుడు నా కథ అనిపించింది : దిల్ రాజు

Dil Raju,  Vamsi Paidipalli, Jayasudha, Srikanth and others
Dil Raju, Vamsi Paidipalli, Jayasudha, Srikanth and others
వారసుడు కథ చెప్పగానే నా కోసమే నా కథ చెప్పాడు వంశీ అనిపించింది. ఆ టైములో మా అమ్మ గారికి ఆరోగ్యము బాగోలేదు. అమ్మ, నాన్న విలువ ఈ సినిమాలో చక్కగా చెప్పాడు.. అని దిల్ రాజు అన్నారు.  దళపతి విజయ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వారసుడు/వారిసు.  రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

జనవరి 11న తమిళ్ లో విడుదలైన వారిసు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన అక్కడ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. జనవరి 14న వారసుడు తెలుగులో గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
 
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. నా జీవితంలో కుటుంబానికి చాలా ప్రాధన్యత వుంటుంది. ఎన్ని కష్టాల్లో కూడా మనతో తోడు వుండేది మన కుటుంబమే. ప్రతి కుటుంబాల్లో లోపాలు వుంటాయి. కానీ ఉన్నది ఒకటే కుటుంబం’. ఈ ఆలోచనతోనే వారసుడు కథ పై వర్క్ చేశాం. విజయ్ గారి కథ చెబితే ఒకే ఒక సిట్టింగ్ లో ఓకే అయిపోయిన కథ ఇది. అయితే విజయ్ గారితో ఈ సినిమా చేస్తున్నామన్న తర్వాత టెన్షన్ మొదలైయింది. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్  స్టార్. ఆయనకి సరిపడే విధంగా ఈ సినిమా చేయడం కోసం మంచి టీం వర్క్ చేశాం. వారిసు సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమా చూసి అందరూ నిలబడి క్లాప్స్ కొడుతున్నారు . ఒక మంచి కథని చెబితే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో వారసుడు మరోసారి నిరూపించింది. సినిమాని ప్రేమించడానికి ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి ఉండాల్సిన ప్రత్యేకత ఈ సినిమాకి వుంది. శరత్ కుమార్ , జయసుధ గారి నటన గురించి అద్భుతంగా రాస్తున్నారు. అమ్మ నిజం, నాన్న నమ్మకం అదే ఈ సినిమాలో చూస్తారు.  సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆడిటోరియం మొత్తం లేచి మావైపు చూస్తూ చప్పట్లు కొట్టారు. అరవింద్ గారు ఫోన్ చేసి ‘’వెయ్యి కోట్లు పెట్టిన రాని అనుభూతి ఇది’’ అని అభినందించారు.  14వ తేదిన అదే రెస్పాన్స్ తెలుగు ప్రేక్షకుల నుండి వస్తుంది. ఎందుకంటె ఇది ఒక తెలుగు గుండె తీసిన సినిమా. దిల్ రాజు గారికి కృతజ్ఞతలు.  నేను ఏది అడిగిన కాదనకుండా ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్, శ్యామ్ .. నటీనటులు అంతా అద్భుతంగా చేశారు. రష్మిక చాలా బ్యూటీఫుల్ గా చేసింది. వారసుడు ఒక పండగ లాంటి సినిమా.  సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వస్తున్నపుడు  అమ్మనాన్నలకు ఒక కాల్ చేయాలని అనిపిస్తుంది. సంక్రాంతి కి వారసుడు సంక్రాంతి సెలబ్రేట్ అవుతుందని నమ్మకం వుంది’’ అన్నారు  
 
దిల్ రాజు మాట్లడుతూ..   క్లైమాక్స్ పుర్తవగానే వంశీని హాగ్ చేసుకున్నా. ప్రేక్షకులు అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తర్వాత 11 ఉదయం ఆడియన్స్ షో వెళ్లాం. ఆడియన్స్ అంతా నిలుచుని క్లాప్స్ కొట్టారు. ప్రేక్షకుల వచ్చిన ఆదరణతో మేము పడ్డ కష్టాలు మర్చిపోయాం. ఈ సినిమా కోసం వంశీ, తమన్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. ప్రేక్షకుల చూపిన రెస్పాన్స్ కి తమన్ వంశీ ఏడ్చారు.  బొమ్మరిల్లు సినిమాని శాంతి థియేటర్ లో చూస్తున్నపుడు ఒక ఫోన్ కాల్ వస్తే నేను ఏడ్చా. మళ్ళీ ఇన్నాళ్ళుకు  వారిసు చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చాయి. ఇది అనుకున్నది నిజం అవ్వడం వలన వచ్చే ఆనందం. సినిమాతో కనెక్ట్ అయితే ప్రేక్షకుల వచ్చే ఆదరణ.
వారసుడు టీం అందరికీ కృతజ్ఞతలు. ఎక్కడ రాజీ పడకుండా సినిమా చేసే దర్శకుడు వంశీపైడిపల్లి.  తమన్ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని చూడలేకపోయాను. అంత హార్డ్ వర్క్ చేశారు. వంశీ ప్రతి సినిమాని కొత్తగా చెప్పాలనే తపన వున్న దర్శకుడు. ఈ సినిమా కోసం దాదపు ఏడాదిన్నర ప్రయాణించాం. ఈ రోజు వారిసు ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం వంశీ పైడిపల్లి హార్డ్ వర్క్. నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా చేశాడు వంశీ. తనకి మరిన్ని విజయాలు రావాలి. సుమన్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రభు, ఎస్ జే సూర్య, .. విజయ్.. మొత్తం ఎనిమిది మంది హీరోలని పెట్టుకొని అందరి దగ్గర నుండి అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ లు రాబట్టుకున్నాడు వంశీ. సినిమాని అందరూ కనెక్ట్ చేసుకున్నారు. జయసుధ గారు, శరత్ కుమార్ గారు మదర్ అండ్ ఫాదర్ గా అద్భుతంగా నటించారు. విజయ్ గారు తమిళ సూపర్ స్టార్. ఈ రోజు మీ దిల్ రాజు, మీ వంశీ తమిళ్ లో కి వెళ్లి ఒక బ్లాక్ బస్టర్ కొట్టి వచ్చారు. చాలా గర్వంగా వుంది. ఆర్ఆర్ఆర్ సినిమాని మనవాళ్ళు ప్రపంచానికి గర్వంగా చూపించారు. ఈ రోజు మేమిద్దరం వెళ్లి తమిళ నాడులో ఒక సూపర్ హిట్ కొట్టి మీ ముందుకు వచ్చాం. ఇది గ్రేట్ ఫీలింగ్. సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, శతమానం భవతి .. ఇలా ప్రతి సంక్రాంతి ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. జనవరి 14న ఈ సంక్రాంతికి ‘వారసుడు’ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా పెద్ద హిట్ చేస్తారు. సంక్రాంతికి ప్రేక్షకులు ఒక ఫ్యామిలీతో వెళ్లి మంచి సినిమాని చూడాలని అనుకుంటున్నారు. అలంటి మంచి ఫ్యామిలీ సినిమానే వారసుడు. తమిళనాట పెద్ద విజయం సాధించింది. ఆల్రెడీ ప్రూవ్ అయిన సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. మరో పెద్ద హిట్ మాకు ఇవ్వబోతున్నామనే నమ్మకంతో వున్నాం. సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ గారి సినిమాకి మంచి టాక్ తో ముందుకు వెళుతుంది. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య కూడా మంచి సక్సెస్ కావాలి. 14న వస్తున్న మా సినిమా వారసుడు కూడా పెద్ద సక్సెస్ కావాలి అన్ని సినిమాలు బావుండాలి. అన్ని సినిమాలకి డబ్బులు రావాలి’’ అన్నారు.