1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Pawan Kalyan heading for divorce for 3rd time?

వివాహాలు-విడాకులు.. మూడోసారి ముచ్చటగా పవన్ ఆ పని చేస్తారా?

Pawan
Pawan
భారతీయ వినోద పరిశ్రమ దాని ప్రముఖ నటీనటుల మధ్య వివాహాలు-విడాకులు మామూలే. కొన్నేళ్లుగా, చాలామంది సెలబ్రిటీలు తమ వివాహాలకు బైబై చెప్పేసి విడాకులు పుచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో సమంత- నాగచైతన్యల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడోసారి విడాకుల బాట పట్టనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 
 
పవన్ కళ్యాణ్ ఆయన మూడవ భార్య అన్నా లెజ్నెవాకు దూరమవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లలో పుకార్లు మస్తుగా రొటేట్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఈ జంట కేసు వేశారని.. త్వరలో విడాకులు తీసుకుంటారని వదంతలు వస్తున్నాయి.
 
పవన్ కళ్యాణ్- అన్నా లెజ్నెవా 2013లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పోలెనా అంజనా పవనోవ్నా అనే కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు. గతంలో నందిని, రేణు దేశాయ్‌లను పెళ్లి చేసుకున్న కళ్యాణ్‌కి ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వారసుడు నా కథ అనిపించింది : దిల్ రాజు